బిగ్ బాస్ సీజన్ 5 చప్పగా.. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండానే 50 రోజులు పూర్తి చేసేసుకుంది. ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్స్ బయటికి వెళ్లారు. సరయు, ఉమా దేవి, లహరి, హమీద, నటరాజ్ మాస్టర్, శ్వేతా, ప్రియాలు ఎలిమినేట్ అవ్వగా.. హౌస్ లోకి వచ్చిన 19 మందిలో ఎక్కువగా ఆడవారే ఎలిమినేట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ మధ్యన పెద్ద యుద్ధమే నడించింది. కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మొత్తం లాక్ డౌన్ లోనే ఉంటుంది అని.. టాస్క్ లో పోటీ పడి కెప్టెన్సీ టాస్క్ కి అర్హత సాధించిన వారికే హౌస్ లోకి ఎంట్రీ ఉంటుంది అంటూ బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేసాడు.
లోబో, షణ్ముఖ్ లు పేడ లోనుండి పూసలు తీసి కడిగి పెట్టాలి. అందులో లోబో - షణ్ముఖ్ లు బాగానే పెరఫార్మెన్స్ చేసారు. ఆ టాస్క్ అయ్యాక సన్నీ సంచాలక్ గా అవి లెక్కబెడుతుంటే.. 100 మంది 100 వాగుతారు.. అనగానే సన్నీ షాకయ్యాడు. 100 వంద వాడుతారు అంటే.. ఇంట్లోనే అంతమంది లేరు అని విశ్వ అనగానే.. ఆ 100 మందిలో నువ్వు ఉన్నావా అని షన్ను విశ్వని అడిగాడు.. షన్ను కాస్త రెచ్చిపోగా.. లోబో షన్నుని ఆపడానికి ట్రై చేసాడు. నీటిలో ఉన్నవే లెక్కించాలని లేదక్కడ అని కాజల్ అంది. దానికి లోబో హలో దయచేసి వదరడం ఆపుతారా.. అక్కడ సంచాలక్ చూసుకుంటున్నాడుగా మధ్యలో మీకెందుకు అని అనగానే .. కాజల్ నీకు వినాలని లేకపోతె చెవుమూసుకో లోబో.. నేను బారాబర్ మాట్లాడతాను.. అనగానే లోబో దానికి ఇక్కడ మాట్లాడకు పక్కకు పోయి మాట్లాడుకో అన్నాడు.. కానీ కాజల్ మాత్రం నేను ఇక్కడే మాట్లాడతాను.. చేసుకో ఏం చేసుకుంటావో అంటుంది. ఇది ఈ రోజు వదిలిన ప్రోమో హైలైట్స్.