Advertisement
Google Ads BL

ఒకే స్టేజ్ పై ఐకాన్ స్టార్ - రౌడీ స్టార్


టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజ్ పై అంటే అభిమానులకి పండగే. ఆ స్టార్ హీరోలు ఇద్దరూ పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్న హీరోస్ అయితే.. ఫాన్స్ కి పూనకాలే. వాళ్ళే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ స్టైలిష్ గా పోటీపడే హీరోలు. రౌడీ బ్రాండ్స్ నచ్చాయన్న అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్స్ దుస్తులు గిఫ్ట్ గా ఇచ్చాడు. పుష్ప తో అల్లు అర్జున్, లైగర్ తో విజయ్ దేవరకొండ లు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ ఇద్దరూ ఒకే స్టేజ్ పై సందడి చేస్తే.. ఆ క్రేజ్ మాములుగా ఉండదు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రాబోతున్న పుష్పక విమానం సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజ్ పైకి రాబోతున్నారు. పుష్పక విమానం సినిమా నవంబర్ 12 న విడుదల కాబోతుంది.. ఈ సినిమాని విజయ్ దేవరకొండ నిర్మించాడు. అందుకే భారీగా ప్రమోషన్స్ మొదలు పెట్టి.. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని ఆహ్వానించారు. ఈ నెల 30 న పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ అండ్ రౌడీ స్టార్స్ సందడి చెయ్యబోతున్నారన్నమాట. 

Allu Arjun, Vijay Devarakonda to power Pushpaka Vimanam trailer:

<span>Pushpaka Vimanam trailer on Oct 30</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs