కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ తనం. ఆయన చిత్రాల్లో గ్రాఫిక్స్ కానివ్వండి ఆయన వేసే సెట్స్ కానివ్వండి.. నిర్మాతల గుండెలు గుభేల్ మానేలా ఖర్చు పెట్టించే సత్తా ఉన్న దర్శకుడు. భారతీయుడు 2 నుండి తప్పించుకున్న దిల్ రాజు.. రామ్ చరణ్ RC15 అంటూ శంకర్ దగ్గరికి వెళ్ళాడు. మరి దిల్ రాజు శంకర్ కథకి ఎలా ఒప్పుకున్నాడో? ఆయన కండిషన్స్ ఈయన ఒప్పుకున్నాడా? లేదంటే ఈయన కండిషన్స్ ఆయన ఒప్పుకున్నాడో? తెలియదు కానీ.. RC15 అఫీషియల్ గా పట్టాలెక్కింది. తాజాగా రామ్ చరణ్ - కియారా అద్వానీ ల మీద సాంగ్ చిత్రీకరణ పూణేలో జరుగుతుంది.
అయితే రామ్ చరణ్ - కియారా లపై తెరకెక్కిస్తున్న ఈ సాంగ్ చిత్రీకరణ ఏకంగా 12 రోజులు పడుతుందట. మరి సాంగ్స్ అంటే ఒకటి రెండు.. అంతకు మించి అంటే ఐదు రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. కానీ శంకర్ ఒక్క సాంగ్ కే 12 రోజుల్ టైం తీసుకుంటున్నారు అంటే.. ఆ సాంగ్ కి ఎంత ఖర్చు పెడుతున్నారో మరి. పాటల కోసమే ఆయన కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తూ ఉంటాడు. రామ్ చరణ్-కియారాపై చిత్రీకరిస్తున్న ఈ పాట అద్భుతమైన విజువల్స్ తో తెరపై కనిపిస్తుంది అని.. అందుకే అన్ని రోజుల టైం అంటున్నారు. ఆ పాటకి సినిమాలో ఉన్న ప్రాధాన్యతని బట్టే దిల్ రాజు వెనుకాడకుండా భారీగా ఖర్చు చేస్తున్నాడట.