సూపర్ స్టార్ రజినీకాంత్ శివ దర్శకత్వంలో నటించిన అన్నాత్తే సినిమా దీపావళి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా రజినీకాంత్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ రోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ని అందుకున్నారు. కొన్నేళ్లుగా రజినీకాంత్ సినీ పరిశ్రమకి చేస్తోన్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవించింది. వెంకయ్య నాయుడు నుండి దాదాసాహెబ్ ఫాల్కే అందుకోవడం అందంగా ఉంది అని, తనకి ఈ అవార్డు రావడానికి కారణమైన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీకల్ సిబ్బందిని గుర్తు చేసుకున్నారు రజిని.
అంతేకాకుండా రజినీకాంత్ తనదైన స్టయిల్లో భారత ప్రభుత్వం తనకు అందించిన ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని తన గురువు కె. బాలచందర్, రజినీకాంత్ అన్నయ్య అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, రజిని మిత్రుడు రాజ్ బహుదూర్, అలాగే రజినీకాంత్ తో సినిమాలు చేసిన నిర్మాతలు, దర్శకులు, సహ నటులు, టెక్నీకల్ సిబ్బంది, డిస్టిబ్యూటర్స్, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, ఫాన్స్, తమిళ ప్రజలకి అంకితమిస్తున్నా అంటూ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.