Advertisement
Google Ads BL

మీకో నమస్కారం అంటున్న పవన్ - మహేష్


రాజమౌళి ఆగి ఆగి ఆర్.ఆర్.ఆర్ ని జనవరి 7 న రిలీజ్ చేస్తున్నారు అనగానే సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీమ్లా నాయక్ మేకర్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆర్.ఆర్.ఆర్ వస్తుంటే తమ సినిమాలను వారం గ్యాప్ లో ఎలా రిలీజ్ చెయ్యాలి అని. కానీ ధైర్యం చేసి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సంక్రాంతి కే ఫిక్స్ అయినట్లుగా వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని మీకో నమస్కారం అంటూ తమ రిలీజ్ డేట్స్ మార్చుకోబోతున్నాయని వినికిడి.

Advertisement
CJ Advs

సర్కారు వారి పాటను కూల్ గా సమ్మర్ రిలీజ్ చేద్దామని మహేష్ అండ్ టీం ఆలోచనలో ఉన్నారట. మరోపక్క భీమ్లా నాయక్ ని ఫిబ్రవరి అయినా. లేదంటే మార్చి లో ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. మరి నిజంగానే ఆర్.ఆర్.ఆర్ తో పెట్టుకోవడం ఎందుకు అని.. పవన్, మహేష్ రిలీజ్ డేట్స్ మార్చేస్తారా? అనేది మహేష్ అండ్ పవన్ ఫాన్స్ లో మొదలైన అనుమానం. ఒకవేళ మహేష్, పవన్ బరి నుండి తప్పుకుంటే ఆర్.ఆర్.ఆర్ కి కేవలం ప్రభాస్ రాధేశ్యామ్ తప్ప మరో పోటీ అయితే ఉండదు. మరి ఫైనల్ గా ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో చూద్దాం. 

Sarkaru Vaari Paata, Bheemla Nayak to change their dates?:

New release dates for Sarkaru Vaari Paata and Bheemla nayak?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs