విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో కరణ్ జొహార్, పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ షూట్ ముంబై లో జరుగుతుంది. గోవా షెడ్యూల్ ముగించుకున్న లైగర్ టీం తాజాగా ముంబై లో అడుగు పెట్టింది. ఇక ముంబై షెడ్యూల్ లో లైగర్ సాంగ్ చిత్రీకరణ చేపట్టినట్లుగా నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయ్ దేవరకొండ డాన్స్ ఇరగ దీస్తున్నాడు, విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరుస్తారు. నన్ను నమ్మండి. మాస్ క్రేజీగా ఉండబోతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను అంటూ విజయ్ ఫేస్ ని కవర్ చేస్తూ ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయ్ చేతికి ఉంగరాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది అంటున్నారు.
అయితే ఈ సాంగ్ లో హీరోయిన్ అనన్య పాండే ఉంటుందో లేదో కానీ.. విజయ్ పిక్ షేర్ చేసి ముంబై లో లైగర్ సాంగ్ షూట్ అంటూ ప్రకటించారు. ఇక ప్రస్తుతం లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ విచారణ లో ఉంది. ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించిన ఎన్సీబీ అధికారులు నేడు సోమవారం కూడా అనన్య పాండే ని విచారిస్తున్నారు. ఇక ముంబై లోనే లైగర్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి అనన్య కి అటు ఎన్సీబీ విచారణ ఇటు సినిమా షూటింగ్ రెండిటికి ఇబ్బంది ఉండదు. ఇక ముంబై లో సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసుకుని లైగర్ టీం యూఎస్ షెడ్యూల్ కోసం రేడి అవుతుంది. ఇక లైగర్ మూవీ 2022 లో థియేటర్స్ లో రిలీజ్ అని విజయ్ మొన్నామధ్యన ఓ ఈవెంట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.