గత వారం నాట్యం, మధుర వైన్స్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా.. హెడ్స్ అండ్ టైల్స్ మూవీ ZEE5 లో డైరెక్ట్ రిలీజ్ అవ్వగా.. ఒక్క సినిమా కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. నాట్యం కి సెలబ్రిటీస్ ఎంతగా సపోర్ట్ చేసినా.. ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు. మధుర వైన్స్ సోసో గా తేలిపోయింది. హెడ్స్ అండ్ టైల్స్ అలానే ఉంది. ఇక ఈ వారం బాక్సాఫీసు వద్ద ఫ్యామిలీ డ్రామా vs లవ్ స్ట్రాప్ అన్న రేంజ్ లో సోషల్ మీడియా ప్రమోషన్స్ ఉన్నాయి. పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ రొమాంటిక్ ని ప్రమోట్ చేసారు.
ఇక నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరుడు కావలెను మూవీ కూడా ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కుటుంబ కథ చిత్రంగా కనిపిస్తున్న వరుడు కావలెను మూవీ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో జోరు మీదున్నాయి. టాప్ హీరోయిన్ పూజ హెగ్డే వరుడు కావలెను మూవీ ప్రమోషన్స్ కి రావడం, రీతూ వర్మ కేరెక్టర్, నాగ శౌర్య కేరెక్టర్స్ అన్ని వరుడు కావలెను మూవీకి ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. ఈ వారం మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో రావణ లంక, తీరం మూవీస్ కూడా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతున్నాయి. కానీ వరుడు కావలెను vs రొమాంటిక్ చిత్రాల మధ్యనే గట్టి పోటీ కనిపిస్తుంది. మరి ఈ వారం ఫ్యామిలీ డ్రామానా లేదా.. లవ్ స్టోరీ నా అనేది శుక్రవారం తేలిపోతుంది.