ఈ రోజు ఇండియా vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్.. అందుకే సామాన్యులే కాదు.. సెలబ్రిటీస్ సైతం ఈ మ్యాచ్ కోసం ఎదురు చూసారు. ఈ రోజు ఉదయం నుండే సాయంత్రం మొదలయిన ఈ మ్యాచ్ కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కొంతమంది అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ చూడడానికి వెళితే.. కొంతమంది సెలబ్రిటీస్ ఇంట్లోనే ఈ మ్యాచ్ తిలకిస్తున్నారు. ఆ మ్యాచ్ ని చూస్తూ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
పుష్ప తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న హీరో అల్లు అర్జున్ తన పిల్ల గ్యాంగ్ అల్లు అర్హ, అల్లు ఆయన్ లతో కలసి ఇంట్లోనే LED టివి లో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని స్నేహ రెడ్డి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. బన్నీ కింద కూర్చుంటే.. అర్హ సోఫాలో కూర్చుని మ్యాచ్ చూస్తున్నారు. మరి నరాలు తెగే ఉత్కంఠతో ఈ మ్యాచ్ లో ఇండియా విన్ అవ్వాలంటూ అందరూ కోరుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ఈ రోజు మ్యాచ్ జరుగుతన్నంతసేపు అందరిలో అదే ఉద్రిక్తత ఉంటుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కానీ.. ప్రస్తుతం మ్యాచ్ మాంచి ఉత్కంఠ తో సాగుతుంది.