Advertisement
Google Ads BL

ముంబై లో ల్యాండ్ అయిన లైగర్


దసరా ముందే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో ల్యాండ్ అయిన లైగర్ టీం.. ఈ మధ్యలో లైగర్ దర్శకుడు పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. లైగర్ నిర్మాత ఛార్మి, దర్శకుడు పూరి ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీని ప్రమోట్ చేస్తూ.. నిన్న వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ని గెస్ట్ గా ఆహ్వానించారు. ఇక రొమాంటిక్ ప్రమోషన్స్ ముగించుకున్న లైగర్ టీం ముంబై పయనమైంది. లైగర్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక ముంబై లో కొత్త షెడ్యూల్ కోసం ఛార్మి, పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ లు స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లారు.

Advertisement
CJ Advs

అక్కడ ముంబై షెడ్యూల్ తర్వాత టీం మొత్తం యూఎస్ వెళ్లబోతుంది. యుఎస్ షెడ్యూల్ ఓ కొలిక్కి వస్తేనే కానీ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వలేమని చెప్పిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ 2022 లో ఉండబోతుంది అని ఆకాష్ పూరి రొమాంటిక్ ఈవెంట్ లో చెప్పాడు. ఇకపోతే ఇప్పుడు విజయ్ అండ్ లైగర్ టీం ముంబై వెళ్లినా.. అక్కడ హీరోయిన్ అనన్య పాండే అందుబాటులో ఉంటుందో లేదో అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అనన్య పాండే ప్రస్తుతం డ్రగ్స్ కేసు విచారణలో ఉంది. ఇప్పటికే రెండు రోజులు విచారణకు హాజరైన అనన్య పాండే సోమవారం కూడా ఎన్సీబీ ముందుకు వెళ్లాల్సి ఉంది. 

Liger readies for Mumbai schedule:

Liger lands in Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs