Advertisement
Google Ads BL

రెండు రోజుల విచారణ.. అనన్యకి మళ్ళీ..


బాలీవుడ్ ని గత ఏడాదిన్నరగా డ్రగ్స్ ప్రకంపనలు కాక రేపుతున్నాయి. గత ఏడాది ఈ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి జైలు కి వెళితే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ జైల్లో కూర్చున్నాడు. ముంబై అందులోను బాలీవుడ్ డ్రగ్స్ కి అడ్డాగా మారింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో.. ఎన్సీబీ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రాకుండా ఎన్సీబీ అడుగడుగునా అడ్డు పడుతుంది. ఈ ఆర్యన్ ఖాన్ కేసులో ఇప్పుడు లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఇరుక్కుంది. ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ చాట్ చేసిన అనన్య పాండే ఇంటికి వెళ్లి సోదాలు చేసిన ఎన్సీబీ అధికారులు.. ఆమెని విచారణకు పిలిచారు.

Advertisement
CJ Advs

గత రెండు రోజులుగా అనన్య పాండే ని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. మొన్న మూడు గంటల పాటు, నిన్న నాలుగు గంటల పాటు అనన్య పాండే ని అధికారులు విచారించారు. అలాగే మరోసారి సోమవారం విచారణకు రావాలంటూ అనన్య చెప్పారు. ఇక నిన్నటి విచారణలో ఆర్యన్ ఖాన్ లో డ్రగ్స్ చాట్ లో తనకి డ్రగ్స్ కావాలని అంటే.. అనన్య పాండే నేను ఆరెంజ్ చేస్తా అని చెప్పినట్టుగా ఫోన్ చాట్ లో ఉంది.  అయితే నేను జస్ట్ జోక్ చేశా అని అనన్య అధికారులకు చెప్పడమే కాదు, తనకి ఎప్పుడూ డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, లైఫ్ లో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి సోమవారం ఎన్సీబీ అధికారులు అనన్య ని ఎలాంటి ప్రశ్నలతో విచారిస్తారో చూడాలి. 

NCB questions Ananya:

Ananya Panday summoned by NCB again on Monday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs