అక్టోబర్ 13 నే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అని మొండి పట్టుదలకు పోయిన రాజమౌళి.. ఆఖరికి థియేటర్స్ అన్ని చోట్ల ఓపెన్ అవ్వని కారణంగా ఆర్.ఆర్.ఆర్ ని పోస్ట్ పోన్ చేసారు. అయితే బాలీవుడ్ మూవీస్ రిలీజ్ డేట్స్ అన్ని ఒక్కసారిగా ప్రకటించడంతో రాజమౌళి పై ఒత్తిడి పెరిగింది. దానితో జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటూ అలియా భట్ గంగూభాయ్ కతీయవాది పై పోటీకి వెళ్లారు. ఇక అక్టోబర్ లో రిలీజ్ అన్నపుడు ఆగష్టు లోనే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలు బెట్టిన రాజమౌళి.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఇచ్చేసి రిలాక్స్ అయ్యారనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ డేట్ ఇచ్చాక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలు పెడతారేమో.. అనుకుంటే.. రాజమౌళి నుండి చడీ చప్పుడు లేదు. అసలే పాన్ ఇండియా మూవీ.. రాజమౌళి ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా అంటున్నారు అభిమానులు. మాములుగా రాజమౌళికి ఎవరూ చెప్పక్కర్లేదు. అంత ప్లానింగ్ తో ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ విషయమే ఫాన్స్ కి మింగుడుపడడం లేదు.
జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ అంటే అంతకుముందు బాలీవుడ్ మూవీస్ భజన, 8 న అలియా భట్ గంగూభాయ్ కతియాది రిలీజ్, ఆ వెంటనే వారానికి ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, ఇక్కడ భీమ్లా నాయక్, అలాగే మహేష్ సర్కారు వారి పాట.. ఇలా మధ్యలో ఆర్.ఆర్.ఆర్ నలిగిపోతుంది. మంచి ప్రమోషన్స్ ఉండి సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తే ఓ 15 రోజుల పాటు ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ ఆపేవారే ఉండరు. మరి రాజమౌళి ఎప్పుడెప్పుడు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలు పెడతారా అని ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అండ్ పాన్ ఇండియా ఫాన్స్ వెయిటింగ్. అప్పుడే కదా ఎన్టీఆర్, రామ్ చరణ్ బయటికి వచ్చి ఫాన్స్ తో మింగిల్ అయ్యేది. మరి బాలీవుడ్ నుండి, తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషలతో పాటు ప్రపంచాన్నే కవర్ చెయ్యడం అనేది ఈ రెండు నెలల టైం సరిపోతుందా అనేది అందరి ఆలోచన అంతే.