Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ కి కళ్ళు చెదిరే ఓటిటి ఆఫర్


పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ పై ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా భీమ్లా నాయక్ పాత్రలో కనిపిస్తుంటే.. రానా మిలటరి ఆఫీసర్ గా డ్యానియల్ శేఖర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈగో పర్సన్స్ గా గొడవపడే పవన్ అండ్ రానా ల మధ్యన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలబోతున్నాయని. పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పిక్స్, గ్లిమ్బ్స్, సాంగ్ ప్రోమోస్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మర్కెట్ లో బోలెడంత బజ్ ఉన్న ఈ మూవీపై ప్రముఖ ఓటిటి సంస్థ కన్నేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అది అమెజాన్ ప్రైమ్ వారు భీమ్లా నాయక్ ని ఓటిటి నుండి రిలీజ్ చేస్తే భారీ ధర చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ చెయ్యబోతున్న భీమ్లా నాయక్ ని అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ చేస్తే 150 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారట మేకర్స్ కి. కానీ మేకర్స్ మాత్రం 150 కోట్ల ఆఫర్ ని తిప్పిపంపినట్లుగా టాక్. మా సినిమా ని ఎన్నికోట్లు ఇచ్చినా ఓటిటికి ఇవ్వమని, థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి భీమ్లా నాయక్ కి 150 కోట్లు అంటే .. మాములు విషయం కాదు అంటున్నారు పవన్ ఫాన్స్. 

Bheemla Nayak Gets A Big Offer From Amazon Prime?:

Amazon Prime Acquires OTT Rights Of Bheemla Nayak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs