Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: ఫ్రెండ్స్ విడిపోయారు


బిగ్ బాస్ సీజన్ 5 ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ లో అంతగా ఆసక్తికర అంశాలు లేకపోయినా.. నాగార్జున ఎపిసోడ్స్ కి స్టార్ మా కి బిగ్ బాస్ నుండి మంచి టీఆర్పీనే వస్తుంది. ఇక గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ లో విశ్వ, రవి, మానస్, సన్నీ లు ఉన్నారు. శ్రీరామ్ కూడా ఉన్నాడు. కానీ సీక్రెట్ రూమ్ నుండి కొన్ని స్పెషల్ పవర్స్ తో బయటికి వచ్చిన లోబో.. శ్రీరామ్ కెప్టెన్సీ కాకుండా చేసాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో జెస్సి గెలవకపోయినా.. షణ్ముఖ్ స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. జెస్సికి సీక్రెట్ టాస్క్ అర్ధం కాక సిరితో కలిసి ఆడి ఓడిపోయాడు.

Advertisement
CJ Advs

సీక్రెట్ టాస్క్ లో తనకి తెలియకుండా భాగం చేసిన జెస్సి, సిరిలపై షణ్ముఖ్ ఫైర్ అవడమే కాదు.. వారిద్దరిని అవాయిడ్ చేస్తున్నాడు. నన్ను చేతకాని వెధవని చేసారు. నాకు టాస్క్ ఆడడం రాదు. అది నా దరిద్రం, కావాలనే నన్ను వెధవని చేసారు.. అంటూ సిరి ని పట్టించుకోవడం లేదు. సిరి ఏడుస్తుంది. జెస్సి ఓదారుస్తున్నాడు. ఇక వాళ్ళ మధ్యన డీప్ ఫ్రెండ్ షిప్ కట్ అయిన ఫీలింగ్ తెప్పించారు. సిరి పెట్టిన జెస్సి తినడం లేదు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ బాధలను హౌస్ మేట్స్ తో పంచుకున్నారు. అందులో సిరి చెప్పింది అని అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. తల్లే పద్దతిగా లేదు.. ఇంకా కూతురేమ్ పద్దతిగా ఉంటుంది అనేవారు మా రిలేటివ్స్, ఊరిలోని వారు. మా బంధువులకి, రిలేటివ్స్ కి చెబుతున్నా.. నేను పద్ధతిగానే పెరిగాను. దానితో సిరి ఎమోషనల్ అవ్వగా జెస్సి ఓదార్చాడు. ఇక ప్రియా కూడా తన లైఫ్ లో జరిగిన బాధలు చెప్పింది. ఇవే ఈ రోజు ప్రోమో హైలైట్స్. 

Bigg Boss 5: Breaks Shanmukh, Siri Friendship:

Bigg Boss 5 Telugu new promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs