Advertisement
Google Ads BL

షారుఖ్ కోసం సల్మాన్ త్యాగం


బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ మంచి దోస్త్ లు. మధ్యలో విడిపోయినా.. మళ్ళీ కలుసుకున్నాక ఫ్రెండ్ షిప్ ని డీప్ గా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈమధ్యన షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీలో దొరికి జైలు ఊచలు లెక్కబెడుతుంటే.. సల్మాన్ ఖాన్ షారుక్ ఇంటికి వెళ్లి ఓదార్చడమే కాదు.. ఇప్పడు ఫ్రెండ్ కోసం చాలా త్యాగాలు కూడా చేసాడు. సల్మాన్ ఖాన్ జింకల వేట, హిట్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో తన తరపున వాదించిన లాయర్లతో ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా షారుఖ్ తన కొడుకు బెయిల్ కోసం తిరగడం, అలాగే బాధలో ఉండడంతో ఆయన నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ జరగకపోతే షారుక్ ఖాన్ స్పెయిన్‌లో జరిగే పఠాన్ సినిమా షూటింగులో పాల్గొనాల్సి ఉంది. అప్పటికే డైరెక్టర్ అండ్ టీం స్పెయిన్ వెళ్ళిపోయింది. మరోపక్క తమిళ్ డైరెక్టర్ అట్లీ కూడా షారుఖ్ లేకపోవడంతో.. వేరే సీన్స్ చిత్రీకరణలో ఉన్నాడు.

Advertisement
CJ Advs

అయితే షారుఖ్ అంటే కొడుకు కోసం షూటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. కానీ సల్మాన్ ఖాన్ కూడా తన ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే..తానూ షూటింగ్స్ చెయ్యలేని అని.. యష్ రాజ్ ఫిలింస్ లో తాను నటిస్తున్న టైగర్ 3 షూటింగును అర్ధాంతరంగా వాయిదా వేసుకొన్నాడు. కాకపోతే వాయిదా వెయ్యడానికి వీలు లేని బిగ్‌బాస్ షోకు సంబంధించిన వీకెండ్ షూట్‌లో మాత్రమే సల్మాన్ ఖాన్ పాల్గొంటున్నాడు. టైగర్ చిత్రంలోని యాక్షన్ సీన్ల కోసం ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్‌తో చేయాల్సిన రిహార్సల్స్‌ను కూడా సల్మాన్ ఖాన్ రద్దు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి మూడోసారి కూడా బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. దానితో షారుఖ్, ఆయన వైఫ్ మరింతగా దిగులు పడిపోయారు.

Salman Sacrifice for Shahrukh:

Shoots of Shah Rukh Khan and Salman Khan starrers Pathan and Tiger 3 cancelled amid Aryan Khan case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs