Advertisement
Google Ads BL

14 రోజుల రిమాండ్ లో పట్టాభి


సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ..టిడిపి నేత పట్టాభిని పోలీస్ బందోబస్త్ మధ్యన అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ని అనరాని మాటలతో పట్టాభి తిట్టారంటూ.. ఆయనపై, టిడిపి అధినేత చంద్ర బాబు పై వైసీపీ మంత్రులే కాదు.. స్వయానా రాష్ట్ర సీఎం విరుచుకుపడ్డారు. అయితే పట్టాభి ఇంటిపై, టిడిపి ఆఫీస్ లపై వైసీపీ కార్యకర్తలు దాడులకు నిరసనగా టిడిపి అధినేత చంద్రబబు ధర్మ దీక్ష చేపటాట్రు.  పోలీస్ స్టేషన్ నుండి పట్టాభిని గురువారం మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవేశ పట్టడంతో ధర్మాసనం ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. తనకి బెయిల్ ఇప్పించాలంటూ పట్టాభి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. దీంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 

Advertisement
CJ Advs

అయితే పోలీస్ స్టేషన్ లో తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు.  తాను సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలనుగానీ తిట్టలేదని.. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత తనను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని పట్టాభి మీడియాకి తెలియజేసారు..

14 Days Remand to TDP Leader Pattabhi :

14 Days Remand for TDP Pattabhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs