Advertisement
Google Ads BL

లైగర్ హీరోయిన్ కి NCB షాక్


బాలీవుడ్ లో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీలో అరెస్ట్ కాకముందే.. గత ఏడాది ఈ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ద కపూర్ లు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కాగా.. ఈ కేసులో సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటికి వచ్చింది. ఇక ఈ ఏడాది జాక్వలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫెతి లని మనీ లాండరింగ్ కేసులో తరుచు విచారణకు పిలుస్తున్నారు ఎన్సీబీ అధికారులు. కాగా ముంబై క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీలో పట్టుబడిన ఆర్యన్ ఖాన్ కి ఎన్సీబీ ఆఖరికి బెయిల్ కూడా రాకూండా చేస్తుంది. ఇక మూడుసార్లు బెయిల్ రిజెక్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ని ఈ రోజు షారుఖ్.. జైల్లో కలవడానికి వెళ్లి ఓ అరగంట మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత ఎన్సీబీ అధికారులు లైగర్ హీరోయిన్ అనన్య పాండే, షారుఖ్ ఖాన్ ఇంటిపై దాడులు చేసారు.

Advertisement
CJ Advs

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీలో దొరకడంతో.. ఈ రోజు షారుఖ్ ఖాన్, అనన్య పాండే ఇళ్లపై ఎన్సీబీ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న లైగర్ మూవీలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. ప్రస్తుతం గోవా లో లైగర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ముంబై వెళ్లిన అనన్య పాండే ఇంటిపై ఎన్సీబీ సోదాలు నిర్వహించడం బాలీవుడ్ లో కలకలం సృష్టించింది. అనన్య పాండే ని విచారణకు రావాల్సిందిగా ఎన్సీబీ అధికారులు నోటీసు లు కూడా ఇచ్చారు. షారుఖ్ ఖాన్ ఆర్యన్ ఖాన్ ని జైల్లో కలిసి రాగానే అయన ఇంటిపై కూడా ఎన్సీబీ దాడులు చేసింది. 

NCB gives a shock Liger Heroine Ananya Panday:

Ananya panday raided by anti - drugs agency, called for questioning
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs