Advertisement
Google Ads BL

జైల్లో కొడుకుని కలిసిన షారుఖ్


షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై లోని క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ ఎన్ సీబీ కి దొరకడంతో.. అప్పటినుండి ఆర్యన్ ఖాన్ ని కష్టడి పేరుతొ జైల్లోనే ఉంచారు. కోర్టు కూడా ఎన్ సీబీ వాదనలతో ఏకీభవిస్తూ ఆర్యన్ ఖాన్ కోసం వస్తున్న బెయిల్ పిటిషన్స్ ని ఇప్పటికీ మూడు సార్లు తిరస్కరించింది. కొడుకు జైలు జీవితం చూసిన షారుఖ్ అండ్ గౌరీ ఖాన్ లు తల్లడిల్లిపోతున్నారు. గౌరీ ఖాన్ సరిగా తినకుండా, నిద్రపోకుండా దేవుడి మందిరంలోనే గడుపుతున్నది. అంతేకాకుండా కొడుకు జైలు నుండి వచ్చేవరకు ఇంట్లో స్వీట్స్ కూడా చెయ్యొద్దు అంటూ స్ట్రిట్ గా వంటవాళ్ళకి ఆర్డర్స్ కూడా పాస్ చేసింది.. అంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఇక ఈ రోజు ముంబాయి లోని ఆర్థర్ జైలులో ఉన్న తన కొడుకుని కలుసుకునేందుకు షారూక్ ఖాన్ జైలుకు వెళ్లారు. క్రూజ్ డ్రగ్స్ కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ తో దాదాపుగా అరగంట పాటు మాట్లాడిన షారూక్.. తిరిగి వెళ్లిపోయారు. కొడుకు తో అతని ఆరోగ్యం, అలాగే జైలు పరిస్థితులని అడిగి తెలుసుకున్నాడు షారుఖ్.. ఇక కుటుంబ సభ్యులు ఏలా ఉన్నారని ఆర్యన్ ఖాన్ షారుఖ్ ని అడిగినట్లుగా తెలుస్తుంది.

Shah Rukh Khan Meets Son Aryan Khan In Mumbai Jail:

Shah Rukh Khan visits son Aryan Khan at Arthur Road jail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs