Advertisement
Google Ads BL

చంద్రబాబుపై కొడాలి తిట్ల పురాణం


కావాలని ప్లాన్ చేసి మరీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టిడిపి నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎవరైనా సరే జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని కొడాలి నాని హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబబు దగ్గర పట్టాభి కూడా డబ్బులు తీసుకొని తిడుతున్నాడన్నారు. పట్టాభి పందిలాంటి వాడు అంటూ కొడాలి నాని సంచలనంగా మాట్లాడారు. చంద్రబాబులా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను పెట్టి తిట్టించడం తమకు రాదని కొడాలి అన్నారు. ఏపీలో ఏదో జరిగిపోతోంది. శాంతిభద్రతలు లేవు. దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్‌ సప్లై చేస్తున్నాడనే ప్రచారం కోసం టీడీపీ ప్రయత్నం చేసింది అని.. టిడిపి కావాలనే ఇలా చేసి.. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుంది అని కొడాలి దుయ్యబట్టారు.

Advertisement
CJ Advs

టిడిపినే కాదు.. ఎవరెన్నీ చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నసీఎం జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరు అన్న కొడాలి.. పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు ఇరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటాడు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తాం. లోకేష్ లాంటి అటూ ఇటూ కానీ వాళ్ళతో ఏమి యుద్ధం చేస్తాం. నన్ను మాట్లాడమంటే వాళ్లకన్నా దారుణంగా చంద్రబాబు ని ఆయన చెంచాలని తిట్టగలను అంటూ ఫైర్ అయ్యారు కొడాలి నాని. 

Kodali Nani fires on Chandrababu Naidu :

Kodali Nani press meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs