సమంత హీరోయిన్ గా ఉన్నా, ఆమె అక్కినేని ఇంటి కోడలైనా కొంతమంది నెటిజెన్స్ సమంత ని ఎక్కువగా ట్రోల్ చేసేవారు. అలాగే అక్కినేని కోడలిగా మారాక సోషల్ మీడియాలో ఆ గ్లామర్ షో ఏమిటి.. ఆ బికినీ పిక్స్ ఏమిటి అంటూ సమంత ని ఆడుకునేవారు. తాజాగా భర్త నాగ చైన్యతో విడిపోవడానికి సమంత నే కారణం అంటూ ట్రోల్ చేయడం సమంత కి బాధని కలిగించింది. అక్కడికీ ట్రోల్స్ చేసేవారికి, సోషల్ మీడియా కి సమంత రిక్వెస్ట్ కూడా చేసింది. డివోర్స్ తీసుకున్న బాధలో ఉన్నా.. నన్ను ఒంటరిగా వదిలేయాలని అన్నా కానీ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది సమంత డివోర్స్ పై మీటింగ్స్ పెట్టి.. డిబేట్స్ పెట్టారు.
అయితే తాజాగా సమంత తన పరువుకి భంగం వాటిల్లేలా.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యవహరించాయంటూ కోర్టుకి వెళ్ళింది. మూడు యూట్యూబ్ ఛానల్స్ పై సమంత పరువు నష్టం దావా వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ.. తనని కించపరుస్తూ.. పరువు కి భంగం వాటిల్లేలా ఆ యూట్యూబ్ ఛానల్స్ ప్రవర్తించాయని.. అందుకే సమంత వాటిపై పరువు నష్టం దావా వేస్తూ కూకట్ పల్లి కోర్టుని ఆశ్రయించింది. తనపై దృష్ప్రచారాలు ఆపాలని కోర్టులో పిటీషన్ వెయ్యడంతో.. ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టులో సమంత పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.