రాజీవ్ కనకాల.. ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న నటుడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల నటిస్తే ఎన్టీఆర్ సినిమాలు హిట్ అనే రేంజ్ లో ఉండేవాడు. అయితే వరస సినిమాల్లో ఖాళీ లేకుండా షూటింగ్ లకి హాజరైన రాజీవ్ కనకాలకి నటుడిగా చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత చిన్న చితక కేరెక్టర్స్ కి పరిమితమైన రాజీవ్ కనకాల ని మళ్ళీ నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా నిలబెట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి కలయికలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలో రాజీవ్ కనకాల సాయి పల్లవి బాబాయ్ గా నెగెటివ్ కేరెక్టర్ లో కనిపించాడు. లవ్ స్టోరీ సినిమా హిట్ అవడం, అందులోను రాజీవ్ కనకాల కేరెక్టర్ హైలెట్ అవడం, లుక్స్ వైజ్ గా ఆయనకి మంచి పేరు రావడంతో టాలీవుడ్ ఇప్పుడు రాజీవ్ కనకాల పేరు మార్మోగిపోతోంది.
రాజీవ్ కనకాల కి ఇండస్ట్రీ నుండి నెగెటివ్ కేరెక్టర్స్, అలాగే స్టార్ హీరోల సినిమాల్లో మంచి కేరెక్టర్స్ వస్తుండడంతో.. రాజీవ్ కనకాల కూడా రెమ్యునరేషన్ పెంచేసాడనే టాక్ మొదలైంది. రాజీవ్ కనకాల లవ్ స్టోరీ హిట్ తర్వాత తన దగ్గరకు ఆఫర్స్ తో వచ్చే నిర్మాతలను గొంతెమ్మ కోరికలతో డిమాండ్ చేసే రేంజ్ కి వెళ్లాడని.. రోజుకి లక్ష రెమ్యునరేషన్ అంటూ రాజీవ్ కనకాల దర్శకనిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి లవ్ స్టోరీ తర్వాత రాజీవ్ కనకాల మళ్ళీ స్టార్ హీరోల ఆఫర్స్ తో బిజీ అవుతుండడం.. సూపర్ అనే చెప్పాలి. అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే సామెతని రాజీవ్ కనకాల బాగానే వంటబట్టించుకున్నట్టు ఉన్నాడు. మరి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రాజీవ్ కనకాలని ఎవరైనా కన్సిడర్ చేస్తారో.. లేదో.. చూడాలి.