సమంత అక్కినేని.. ఇప్పుడు సమంత రౌత్ ప్రభు. నాగ చైతన్య నుండి విడిపోయాక సోషల్ మీడియాలో సర్ నేమ్ మార్చేసిన సమంత చైతు తో డివోర్స్ తర్వాత ఎంతగా సఫర్ అయ్యిందో.. అదంతా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అర్ధమైంది. అయితే నాగ చైతన్య లవ్ స్టోరీ రిలీజ్ తర్వాత థాంక్యూ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి మీడియా కి దూరంగా ఉన్నాడు. కానీ సమంత దసరా కి రెండు సినిమాలు ప్రకటించేసింది. ఆ రెండు సినిమాలు తెలుగు, తమిళ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కేవే. అయితే ఈ రెండు సినిమాలకి సమంత భారీ పారితోషకం అందుకోబోతుందట. అలాగే సమంత కి ఓ బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట.
అది అట్లీ - షారుఖ్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కోసం నయన్ ప్లేస్ లో సమంత ని ఎంపిక చేసారు దీని కోసం సమంత కి ఏకంగా 7 కోట్లు పారితోషకం ఇవ్వబోతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఆహా వెబ్ సీరీస్ కోసం సమంత ని సంప్రదించగా.. సమంత భారీగా డిమాండ్ చేసింది అని.. విడాకుల తర్వాత సమంత కేరెర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది అని.. అటు బిజీగా మారితే.. ఇటు పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రోబ్లెంస్ ని మరిచిపోవచ్చని.. అలాగే డిమాండ్ ని బట్టి పని కాబట్టి సమంత ఆ సూత్రాన్నే ఫాలో అవుతుంది అని అంటున్నారు. మరి సమంత ఇప్పటికి ఫిట్ గా, గ్లామర్ గా అదరగొట్టేస్తూనే ఉంది.