Advertisement
Google Ads BL

మరోసారి సోనూసూద్ దాతృత్వం


కరోనా క్రైసిస్ టైం నుండి సోను సూద్ చేసే సేవ కార్యక్రమాలు చూసిన వారు సోను సూద్ ని దేవుడి మాదిరి కొలిచేస్తున్నారు. లాక్ డౌన్ లో అనేకమంది పేదలకి సహాయం చేసిన సోను సూద్ ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ప్రభుత్వం పగబట్టి ఐటి దాడులు చేయించినా బెదరకుండా సోను సూద్ తన దాతృత్వాన్ని చాటుతున్నాడు. తాజాగా సోను సూద్ చేసిన మరో మంచి పని మీడియాలో హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. 

ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్..వారిని ముంబై రప్పించుకున్నారు. ముంబై లోని  వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

Sonu Sood shows his generosity yet again:

Sonu Sood, who responded promptly, brought them to Mumbai and arranged for the heart surgery in Wadia Hospital, Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs