Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ అది కూడా ఫినిష్ చేసేసాడు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తో పాటుగా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసేసి తాను చేస్తున్న గేమ్ షో.. ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ని రన్ చేస్తుంది. ఎన్టీఆర్ క్రేజ్, ఇమేజ్ తో షో కి హైప్ క్రియేట్ అయినా, షో కి సెలెబ్రెటీ గెస్ట్ లు వచ్చినా, ఎన్టీఆర్ చెయ్యాల్సింది చేసినా.. ఎందుకో ఎవరు మీలో కోటీశ్వరులు షో ని బుల్లితెర ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. ఎన్టీఆర్ క్రేజ్ కూడా సరిపోలేదు. ఆ షో కి భారీ టీఆర్పీ రాలేదు. ఇక తాజాగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి సీజన్ ని పూర్తి చేసేసాడు.

Advertisement
CJ Advs

ఇప్పటివరకు రామ్ చరణ్, సమంత, రాజమౌళి, కొరటాల లు సెలెబ్రిటీ గెస్ట్ లుగా రాగా.. ఇప్పడు మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవిశ్రీ లు ఈ షో కి గెస్ట్ లు రాబోతున్నారు. ఇక ఈ షో మొదటి సీజ్ పూర్తి కావడంతో.. రెండో సీజన్ పై అందరిలో ఆసక్తి బయలుదేరింది. అయితే ఎవరు కోటీశ్వరులు షో కి ఎన్టీఆర్ మళ్ళీ హోస్ట్ గా చేస్తాడంటే నమ్మకం లేదంటున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ తో ఎవరు మీలో కోటీస్వరులని గట్టెక్కించలేకపోయాడంటూ ప్రచారం జరగడంతో ఎన్టీఆర్ మరోసారి ఈ షో కి హోస్ట్ గా చెయ్యడానికి ఒప్పుకోకపోవచ్చు అని, ఎందుకంటే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పని ఎన్టీఆర్ చెయ్యడనే టాక్ మొదలయ్యింది.

NTR finishes shooting for EMK:

Young tiger NTR finishes shooting for Eevaru meelo koteeswarulu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs