ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా టీ సీరియస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ 3D సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఇప్పటికే రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. రీసెంట్ గానే కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేసింది. జానకి పాత్రధారి కృతి సనన్ పార్ట్ షూటింగ్ చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది అంటూ కేక్ కూడా కట్ చేసారు. ఇక తాజాగా కృతి సనన్ తన తదుపరి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా కృతి సనన్ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్స్ ఆదిపురుష్ జానకి ఫోటో షూట్ అదుర్స్ అంటూ రియాక్ట్ అవుతున్నారు.