ప్రభాస్ పుట్టిన రోజుకి కౌన్ డౌన్ మొదలైపోయింది. మరో నాలుగు రోజుల్లో ప్రభాస్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు నాడు ప్రభాస్ సినిమాల నుండి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ అంటూ ఎన్ని అప్ డేట్స్ వస్తాయో అని ప్రభాస్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. రాధేశ్యామ్ నుండి టీజర్ రాబోతుంది అని, ప్రశాంత్ నీల్ కాంబో సలార్ నుండి రిలీజ్ డేట్ రాబోతుంది అని, ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతుంది, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె నుండి అప్ డేట్ ఏదో ఒకటి ఉంటుంది అని, ఇక స్పిరిట్ నుండి హీరోయిన్ విషయం క్లారిటీ రాబోతుంది, అలాగే ఇంకా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటనలు ఉండబోతున్నాయనే న్యూస్ నడుస్తుంది. గత రెండు రోజులుగా ప్రభాస్ ఏదో ఒక సినిమా విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
నిన్న రాధేశ్యామ్ టీజర్ విషయమై ట్రెండ్ అవ్వగా.. నేడు సలార్ ట్రేండింగ్ లోకి వచ్చింది. అది కూడా ఓ లీకెడ్ పిక్ ని ప్రభాస్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆ పిక్ లో ప్రభాస్ చేతిలో గన్ తో కనిపిస్తున్నాడు. అది ఓ యాక్షన్ సీన్ కి సంబందించిన పిక్. ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ ఆ లీకెడ్ పిక్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబో సలార్ ట్రెండ్ సెట్టర్ అవడం ఖాయం అని, బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫాన్స్ ఓ రేంజ్ లో హడావిడి మొదలు పెట్టారు. లీకెడ్ పిక్స్ కే ఇలా ఉంటే.. ఒరిజినల్ పిక్స్ కి ప్రభాస్ ఫాన్స్ ఇంకెంత హడావిడి చేస్తారో..