ఏపీలో టీడీపీ పార్టీ కి అన్ని ఎదురు దెబ్బలే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చాలామంది టీడీపీ నేతలు వైసిపి కండువా కప్పుకోగా.. వైసిపి అంటే నచ్చని నేతలు బిజెపి గూటికి వెళ్లిపోయారు. సీఎం రమేష్, సృజన చౌదరి.. ఆ లిస్ట్ లో చాలామంది బిజెపి గూటికి చేరుకున్నారు. ఇక కొంతమంది ఇంకా టిడిపిలోనే కొనసాగుతూ చంద్రబాబు మీద కోపం వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు. గతంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. అలాగే తాను 2024 ఎన్నికల్లో పోటీ చెయ్యను అని చెప్పిన నాని.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నాడు. మరోపక్క గోరంట్ల వ్యవహారంతో చంద్రబాబు కి ముచ్చెమటలు పట్టాయి. అప్పటినుండి సైలెంట్ గానే ఉన్న కేశినేని నాని మరోసారి హైలెట్ అయ్యాడు.
ఢిల్లీ లో బిజెపి పెద్దలని కలుస్తూ బిజెపి గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు నాని. అలాగే విజయవాడ కేశినేని ఆఫీస్ లో టీడీపీ, చంద్రబాబు నాయుడు ఉన్న ఫొటోస్ ని తొలగించి రతన్ టాటా ఫొటోస్ ని పెట్టడం మీడియాలో న్యూస్ అయ్యింది. ఇక టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలని తొలగించడం హాట్ టాపిక్ కాగా.. కష్ట కాలంలో టీడీపీ ని వదిలి కేశినేని నాని బిజెపి తీర్ధం పుచ్చుకోబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. రేపో ఎల్లుండో నాని చంద్రబాబు కి టీడీపీ బై బై చెప్పెయ్యబోతున్నాడని.. ఇది చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు. అయితే కేశినేని నాని టీడీపీ ని వీడడానికి.. బెజవాడలోని టీడీపీ అంతర్గత కలహాలను అధినేత చక్కబెట్టకపోవడమే అని అంటున్నారు..