Advertisement
Google Ads BL

మాట మార్చిన మంచు విష్ణు


మా ఎన్నికల్లో మోహన్ బాబు కి మెగా ఫ్యామిలీ కి మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా గొడవ పెరిగిపోయింది. నాగబాబు డైరెక్ట్ గానే మంచు ఫ్యామిలీకి పంచ్ వేస్తే.. చిరు ఫోన్ చేసి మంచు విష్ణు ని మా ఎన్నికల నుండి తప్పుకోమన్నారు అని మంచు విష్ణునే చెప్పాడు. ఇక చిరు మంచు విష్ణు కి ఓటు వెయ్యకపోతే రామ్ చరణ్ కూడా వెయ్యడు అని మంచు విష్ణు బహిరంగంగానే అన్నాడు. తాజాగా మంచు విష్ణు అలయ్ బలయ్ ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్ ఉన్నవీడియో ని షేర్ చేసి పవన్ తనతో మాట్లాడలేదు అన్నట్టుగా క్రియేట్ చేసాడు. ఇక మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి చిరు కి ఆహ్వానం లేదు. దానితో మంచు - మెగా ఫ్యామిలీ కి మధ్యన దూరం పెరిగింది అనుకున్నారు. నిన్న మంచు విష్ణు వీడియో తో పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఈవెంట్ లో మంచు విష్ణు ని పలకరియ్యలేదు అని ఛానల్స్ హడావిడి చేసాయి. 

Advertisement
CJ Advs

కానీ ఈ రోజు మంచు విష్ణు పవన్ కళ్యాణ్ నాతో ఆలయ బలయ్ ప్రోగ్రాం లో  మట్లాడారు అని, అలయ్ బలయ్ లో పవన్ తాను స్టేజ్ కింద చాలాసేపు మాట్లాడుకున్నాం అని, ప్రోటోకాల్ కారణంగా స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడుకోలేదని.. చెప్పాడు. మా కళామతల్లికి బాగా చూసుకోమని, మా అధ్యక్షుడిగా మంచి పనులు చెయ్యమని పవన్ చెప్పినట్లుగా చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పిన విష్ణు ఇక చిరుకి మోహన్ బాబు ఫోన్ చేసి నిన్ననే మాట్లాడారు అని.. మెగా ఫ్యామిలీతో ఎలాంటి ప్రోబ్లెంస్ లేవు అంటూ మంచు విష్ణు తిరుపతి శ్రీవారి దర్శనానంతరం మీడియా తో మాట్లాడాడు. 

Manchu Vishnu who changed his words:

Chiranjeevi calls Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs