ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ.. స్టార్ హీరోలని ర్యాగింగ్ చేసే సమంత ఇప్పుడు కూడా నవ్వుతుంది కానీ.. అందులో జీవం లేదు. కళ లేదు. కారణం ఆమె వైవాహిక జీవితానికి ముగింపు పలకడమే. మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఆయా సినిమాల ప్రమోషన్స్ లో సమంత చాల చక్కగా ఎనర్జీ తో.. స్టార్ హీరోలను సైతం ర్యాగింగ్ చేసేది. ఒకసారి మహేష్ బాబు, త్రివిక్రమ్ కూడా సమంత ర్యాగింగ్ అంటూ ఏడిపించారు.. ఇక సమంత గలగలా మాట్లాడుతుంటే నేను ఉండను బాబోయ్ అంటూ ఎన్టీఆర్ లేచి వెళ్ళబోయాడు.. అంతలా నవ్వుతూ ఉండే సమంత ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుని కష్టపడుతుంది.
నాగ చైతన్య తో పెళ్లి తర్వాత కూడా హ్యాపీ గానే ఉన్న సమంత ఉన్నట్టుండి.. చైతు తో నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలకడం ఎవరూ ఊహించనైననూ లేదు. అంత విషాదాన్ని మోస్తూ .. మొహానికి మేకప్ వేసుకుని సమంత తన పనులని తాను చక్కబెట్టుకుంది. నిన్నగాక మొన్న ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కనిపించిన సమంత నవ్వింది. కానీ ఆమెలో మునుపటి ఉత్సాహం లేదు, ఆ నవ్వు లో జీవం లేదు, కళ లేదు... అసలు సమంత ఎన్నాళ్ళుగానో బాధపడుతున్నట్టుగా మొహం వాడిపోయింది. ఆ బాధ నుండి కోలుకోవడానికి సమంత మునుపటిలా బిజీ కాబోతుంది. ఈ దసరా కి సమంత రెండు సినిమాలను అనౌన్స్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. మరి విమెన్ పవర్, విమెన్ పవర్ అనే సమంత అలానే స్ట్రాంగ్ గా నిలబడాలని కోరుకుందాం.