ఈ రోజు అంటే సోమవారం ఉదయం మోహన్ బాబు తన కొడుకు విష్ణు, కూతురు లక్ష్మి లతో పాటుగా.. మంచు విష్ణు ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మోహన్ బాబు, మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. మా భవనం విషయాన్ని మరో మూడు నెలల్లో ఓ పరిష్కార మార్గం ఆలోచిస్తాము అని.. ఇక మా ఎన్నికల్లో విజయం సాధించి, మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఎన్నికల్లో నా ప్యానెల్ ఎంతో కష్టపడింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసోసియేషన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను.
అయితే ప్రకాశ్‌రాజ్ అలాగే ఆయన ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు రాజీనామాలు చేశారని.. మీడియా ద్వారానే తెలిసింది. వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా మాకు అందలేదు. రాజీనామా లేఖలు అందాక ఆ విషయంపై స్పందిస్తాను.. అంటూ మంచు విష్ణు మాట్లాడారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ మా ఎన్నికల్లో గెలవగానే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము.. అది ఈ రోజు కుదిరింది.. మా అధ్యక్షుడిగా అన్ని నిబంధనలకు లోబడే మంచు విష్ణు పని చేస్తాడు అంటూ చెప్పారు.