ఈ దసరా హాలిడేస్ మొదలు కాగానే.. వైష్ణవ తేజ్ - క్రిష్ - రకుల్ కాంబోలో తెరకెక్కిన కొండ పొలం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సో సో టాక్ తో రెండు మూడు రోజులకే దుకాణం సర్దేసింది. ఇక ఈ దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న శర్వానంద్ - సిద్దార్థ్ కాంబోలో అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం రిలీజ్ అవ్వగా.. ఈ ఫ్రైడే అంటే దసరా సందర్భంగా అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రోషన్ పెళ్లి సందD రిలీజ్ అయ్యాయి. ఇక మహాసముద్రం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా మహా సముద్రం మూవీ కి యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. శర్వానంద్ నటన, రావు రమేష్ నటన, అదితి రావు నటన హైలెట్ అయినా.. సినిమాకి అజయ్ భూపతి మేకింగ్, సిద్దార్థ్ కేరెక్టర్, వీక్ స్క్రీన్ ప్లే అన్ని మహాసముద్రాన్ని తీరం చేరకుండా చేసాయి.
ఇక అఖిల్ అక్కినేని ఎన్నాళ్ళ కలో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో తీరుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే తో జోడి కట్టిన అఖిల్ కి.. మోస్ట్ ఎలిజిబుల్ భారీ హిట్ అయితే ఇవ్వలేదు కానీ.. పర్వాలేదనిపించే హిట్ ని కట్టబెట్టింది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాల కన్నా కాస్త బెటర్ గా ఉంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ. అఖిల్ నటన పరంగా మెరుగవ్వగా.. పూజ హెగ్డే ఎప్పటిలాగా గ్లామర్ లుక్స్ తో అదరగొట్టేసింది. అయితే బొమ్మరిల్లు భాస్కర్ కథనంతో, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చెయ్యలేకపోయాడు. కాస్త కన్ఫ్యూజన్ స్టోరీ తో సో సో అనిపించాడు. అంటే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అదిరిపోయితే హిట్ అని చెప్పలేం కానీ.. ఫస్ట్ డే, సెకండ్ డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెరఫార్మెన్స్ బావుంది అని ఆ రెండు రోజుల కలెక్షన్స్ చూసి చెప్పొచ్చు.
ఇక కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన పెళ్లి సందD కి కనీస ఓపెనింగ్స్ రాలేదు. అవుట్ డేటెడ్ స్టోరీ తో.. పెళ్లి సందD ప్రేక్షకులని ఆకట్టుకోలేక చేతులెత్తేసింది.. ఇక పెళ్లి సందD సినిమాకి క్రిటిక్స్ మరీ పూర్ రెటింగ్స్ ఇచ్చారు.... సో ఈ దసరా విన్నర్ ఎవరో మీరే డిసైడ్ చెయ్యండి.