Advertisement
Google Ads BL

మెగాస్టార్ చిరంజీవి చేతికి సర్జరీ!


కరోనా ఆక్సిజెన్ బ్యాంకు లను అందించిన ఫాన్స్ కి అభినందలు తెలిపేందుకు వచ్చిన చిరు కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం చూసిన అభిమానులందరూ కంగారు పడ్డారు. చిరు కి ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయింది అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్(median nerve) అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్(carpal tunnel syndrome) అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. 

Advertisement
CJ Advs

అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని, దర్శకుడు విజయబాపినీడు అల్లుడయిన సుధాకర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా పరిచయం ఉండడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చానని చిరు వెల్లడించారు. 

చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాని, నవంబర్ ఒకటో తారీకు నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. మీరు ఇంతలా కష్టపడుతూ, మీ బాడీని కష్టపెడుతున్నారు కాబట్టి ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి అని ఇక మీదట కుడి చేతికి ఎలాంటి ఇబ్బంది లేదని సుధాకర్ రెడ్డి వెల్లడించినట్టు మెగాస్టార్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని మెగాస్టార్ అభిమానులతో పేర్కొన్నారు. మెగాస్టార్  చేతికి సర్జరీ అనే మాట వినగానే అభిమానులు తొలుత కంగారు పడినా, ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Surgery to Megastar Chiranjeevi Right hand:

Megastar Chiranjeevi Undergone Right Hand Surgery
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs