Advertisement
Google Ads BL

త్వరలోనే ఎంగేజ్మెంట్: విక్కీ కౌశల్


బాలీవుడ్ లో రణబీర్ కపూర్ - అలియా భట్ లు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. పెళ్ళెప్పుడు అంటే కరోనా తగ్గగానే అంటారు. మొన్నీ మధ్యన రణబీర్ కపూర్ పుట్టిన రోజు వేడులకి జోధ్ పూర్ వెళ్లిన రణబీర్ కపూర్ - అలియా భట్ లు వాళ్ళ వెడ్డింగ్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లో మరింతగా హైలెట్ అవుతున్న మరో క్యూట్ కపుల్ యంగ్ హీరో విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ లు. వీరిద్దరూ చాటుమాటుగా వ్యవహారం నడపడమే కాదు.. అప్పుడప్పుడూ కెమెరా కళ్ళకి చిక్కుతున్నారు. ఇక ఎప్పుడు కనిపించినా పెళ్ళెప్పుడు, ఎంగేజ్మెంట్ ఎప్పుడు అని అడిగినా తప్పించుకుంటారు. మొన్న సెకండ్ లాక్ డౌన్ లో వీరికి ఎంగేజ్మెంట్ కూడా అయినట్లుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

కానీ తాజాగా  విక్కీ కౌశల్ లేటెస్ట్ మూవీ సర్దార్ ఉద్ధం సినిమా ప్రీమియర్స్ లో కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ లు జంటగా దర్శనమివ్వగా.. విక్కీ కౌశల్ తమ ఎంగేజ్మెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు. అదేమిటంటే కత్రినా కైఫ్ తో త్వరలోనే ఎంగేజ్మెంట్ అంటూ తమ పెళ్లి ప్రచారానికి బూస్ట్ ఇచ్చాడు. అంటే త్వరలోనే విక్కీ కౌశల్ - కత్రినా లు కలిసి ఓ ఇంటి వారు కాబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి విక్కీ కౌశల్ ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టేసాడు. 

I Will Get Engaged Soon: Vicky Kaushal :

I Will Get Engaged Soon: Vicky Kaushal, On Rumours About Roka With Katrina Kaif
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs