Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ ని క్యూట్ గా విష్ చేసిన మహేష్


సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్‌తో పాటు ఇతర తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

Advertisement
CJ Advs

ఈ రోజు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె లుక్‌కి సంబంధించి సర్కారు వారి పాట పోస్టర్ రివీల్ చేశారు. గతంలో చీరకట్టులో సంప్రదాయ లుక్ కనిపించిన కీర్తి.. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపించింది. డెనిమ్ జాకెట్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ కీర్తి దర్శనమిచ్చింది.

ఇక మహేష్ బాబు కూడా కీర్తి సురేష్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్.. wishing you unbound happiness and success always అంటూ కీర్తి సురేష్ కి క్యూట్ గా బర్త్ డే విషెస్ తెలియజేసాడు.  

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు సమకురుస్తున్నాయి. ఆర్ మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నారు.  2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Mahesh Babu Wishes Keerthy Suresh On Her Birthday:

<span>Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Wishes Keerthy Suresh On Her Birthday</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs