టాలీవుడ్ లో అవకాశాలు లేని రకుల్.. బాలీవుడ్ లో మాత్రం, వరస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. తెలుగులో రకుల్ నటించిన లాస్ట్ సినిమా కొండ పొలం రకుల్ కి భారీ షాక్ ఇచ్చింది. వరస ప్లాప్స్ తో రకుల్ తెలుగుకి ఆల్మోస్ట్ దూరమైనట్లే. బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీ అయినా రకుల్ ప్రీత్ అక్కడ ఫ్యాషన్ షోస్ లో మెరుస్తుంది. అలాగే ముంబై లోనే ఉంటున్న రకుల్.. జిమ్ వేర్ లోను అదరగొట్టేస్తుంది.
తాజాగా రకుల్ ప్రీత్ బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో రాంప్ వాక్ తో అదరగొట్టేసింది. సోనాక్షి రాజ్ డిజనైర్ వేర్ లో బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో రకుల్.. రాంప్ వాక్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లు కలర్ డిజైనర్ వెర్ లో అందాలను ఆరబోసిన రకుల్.. రాంప్ వాక్ మెరుపులు మీ కోసం..