మా ఎన్నికలు జరిగిన రోజు మోహన్ బాబు వర్గం అవకతవకలకు పాల్పడ్డారని, మోహన్ బాబు, నరేష్ భౌతిక దాడులకు దిగారంటూ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించడం, ఆ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా నెగ్గడంతో.. అనసూయ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచింది అని చెప్పాక.. నెక్స్ట్ డే ఆమె ఓడిపోయినట్లుగా ప్రకటించడంపై చిన్నపాటి యుద్ధమే జరిగింది. ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చెయ్యడం, ఆయన ప్యానల్లో గెలిచిన వారు మంచు విష్ణు పక్కన నరేష్ ఉంటే మేము ఉండలేము అంటూ రాజీనామాలు చెయ్యడంతో.. ఎన్నికల తర్వాత కూడా మా ఎన్నికల మేటర్ హీటెక్కిస్తూనే ఉంది. నరేష్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చెయ్యడం, నోటికి వచ్చినట్లుగా ప్రకాష్ ప్యానల్ ని మాట్లాడడం.. ఈ వివాదం మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణం చేసినా తగ్గలేదు. మొన్న ప్రకాష్ రాజ్ మా ఎన్నికల అధికారి సీసీ టీవీ ఫుటేజ్ చూడాలి అంటూ లేఖ రాయడం ఇంకా వేడిని రాజేసింది.
మా ఎన్నికల అధికారి మోహ కృష్ణ కి లేఖ రాసిన ప్రకాష్ రాజ్ కి మా ఎన్నికల అధికారి రిప్లై ఇచ్చారు. మా ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. కావాలంటే సీసీ టీవీ ఫుటేజ్ ఇస్తామని అన్నారు. కానీ ఈ రోజు మా ఎన్నికలు జరిగిన ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీటీవీ రూమ్ కి పోలీస్ లు తాళం వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వలేమని మా ఎన్నికల అధికారి స్పష్టం చేసారు. కేవలం హైలెట్ అవడానికి, పబ్లిసిటీ కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని, సిసి టీవీ ఫుటేజ్ కావంటే.. కోర్టుకి వెళ్లి తెచ్చుకోమంటూ మా ఎన్నికల అధికారి ప్రకాష్ రాజ్ ప్యానల్ కి ట్విస్ట్ ఇచ్చారు. ఇక పోలీస్ లు రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజ్ ఉన్న రూమ్ ని సీజ్ చేసారు.