బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు ఒక్క ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ అనేది ఏది లేదు. కానీ నాగార్జున వచ్చే శని, ఆదివారాలు ఎపిసోడ్స్ ని మాత్రం బుల్లితెర ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇక దసరా కి బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ లో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రమోషన్స్, పూజ అందాలు, ఇంకా హీరోయిన్స్ డాన్స్, సింగర్స్ పాటలు అన్ని అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ శనివారం నాగార్జున ఎపిసోడ్ యమా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. శనివారం ఉదయం నుండే బిగ్ బాస్ ప్రోమోస్ తో ఈ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ని పెంచేసింది స్టార్ మా.
ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసిన పనులని ఎత్తి చూపుతూ.. నాగార్జున సుతి మెత్తగా వార్నింగ్ ఇస్తూనే హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ లో ఉండడానికి అర్హత లేని వాళ్లలో ఒకరిపేరు చెప్పమనగా ఎక్కువమంది లోబో - ప్రియలకి ఓట్స్ పడినాయి.. ఫైనల్ గా ప్రియా - లోబో మధ్యలో టై అవ్వగా.. మళ్ళీ హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇచ్చి.. లోబో ని ఇంటి నుండి బయటికి పంపారు.. లోబో ని పంపేటప్పుడు విశ్వ వెక్కి వెక్కి ఏడ్చాడు. రవి డల్ అయ్యాడు. బిగ్ బాస్ స్టేజ్ పై కి వచ్చిన లోబో అందరి గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఇక నాగ్ కూడా లోబో ఆల్ ద బెస్ట్ ఇటు వెళ్ళండి అని బయటికి వెళ్ళమని.. అంతలోనే మళ్ళి వెంటనే.. లోబో ని వెనక్కి పిలిచి భయపడ్డవా.. జస్ట్ ఇదంతా ఓ గేమ్.. నాకు కానీ, హౌస్ మేట్స్ కి కానీ నిన్ను డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసే అవకాశం లేదు.. అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది..
సో లోబో నువ్వు ఇప్పుడు సీక్రెట్ రూమ్ లోకి వెళుతున్నావ్.. ఇక హౌస్ మేట్స్ అన్నదాన్ని బట్టి నువ్వు నేరుగా వచ్చే వారం నామినేట్ అయ్యావు.. ఇక హౌస్ లోని వారికి ఐ లవ్ యు చెబితే.. ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తావ్.. కాబట్టి సీక్రెట్ రూమ్ లో ఉండి.. ఎవరు ఎలాంటి వాళ్ళో చూసి ఇకపై గేమ్ ఆడు అంటూ నాగ్ చేసిన ఈ రోజు పెరఫార్మెన్స్ చూస్తే.. అబ్బో మహా నటుడు నాగ్ అనేస్తారు.