ఛలో సినిమాతో సింపుల్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. ఇప్పడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ దున్నేస్తున్న రష్మిక కి లక్కు అడ్డంగా కలిసి వచ్చింది. కాబట్టే పెద్దగా గ్లామర్ లేని, అందం లేని రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది అని నెటిజెన్స్ ఎప్పటినుండి కామెంట్ చేస్తున్నారు. అలాగే రశ్మికకి ముందు నుండే కాస్త యాటిట్యూడ్.. మీడియా వేసే ప్రశ్నలకు వెటకారంగా జవాబు ఇస్తుంది.. పారితోషకం గురించి అడిగితే.. వాళ్లపై విరుచుపడింది.. ఇది రశ్మికపై నెటిజెన్స్ కి ఉన్న కంప్లైంట్స్. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా.. ఇప్పుడు రశ్మికది స్టార్ రేంజ్.. పాన్ ఇండియా రేజ్.
అయితే తాజాగా దసరా సందర్భంగా రష్మిక రెండు ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రకరకాల ఎక్సప్రెషన్స్ తో రష్మిక చెవిలో పువ్వుతో కనిపించింది. ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ కొందరూ.. పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొందరు.. ఇలాంటి దాన్ని ఎలా సినిమాల్లో పెట్టుకుంటున్నారా అంటూ స్పందిస్తున్నారు. అందం లేదు, గ్లామర్ లేదు.. నార్మల్ లుక్స్ తో ఉండే రష్మిక ని స్టార్ హీరోల సినిమాల్లో ఎలా తీసుకున్నారురా బాబు అంటూ రష్మికాని కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే తనని దారుణంగా ట్రోల్ చేసిన నెటిజెన్ కి రష్మిక కూల్ గా రిప్లై ఇచ్చింది. నా యాక్టింగ్ కోసం నన్ను సినిమాల్లో తీసుకుంటున్నారు అంటూ రిప్లై ఇచ్చింది.