Advertisement
Google Ads BL

పోస్టర్ వదిలారు.. రిలీజ్ డేట్ ఎక్కడా


ఏప్రిల్ లో విడుదల కావాల్సిన నాగ చైతన్య - సాయి పల్లవిల లవ్ స్టోరీ సెప్టెంబర్ లోనే విడుదల కావడం.. హిట్ అవడం జరిగిపోయింది. అదే నెలలో విడుదల కావాల్సిన నాని టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ అయ్యింది. కానీ ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన రానా విరాట పర్వం పరిస్థితే ఎవరికీ అర్ధం కావడం లేదు.. విరాట పర్వం మూవీ కి ఓటిటి డీల్ సెట్ అయ్యింది అని, ఓటిటి లోనే విరాట పర్వం రిలీజ్ అన్నప్పటికీ.. థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి చూసాక.. విరాట పర్వం మేకర్స్ థియేటర్స్ కే మొగ్గు చూపుతున్నట్టుగా టాక్ నడిచింది. అయితే అసలు విరాట పర్వం మూవీ ఓటిటిలో రిలీజ్ అవ్వుద్దా? లేదంటే థియేటర్స్ లో రిలీజ్ అవ్వుద్దా? అనేది పక్కనపెట్టండి.

Advertisement
CJ Advs

అసలు ఇంతవరకు ఆ సినిమాకి రిలీజ్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ నానుస్తూనే ఉన్నారు. దసరా సందర్భంగా విరాట పర్వం నుండి పోస్టర్ వదిలారు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. రానా నక్సలైట్ గా నటించగా.. రానాని ఆరాధించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ రానా విరాట పర్వం సినిమాకి రిలీజ్ మోక్షం కలగడం లేదు. వేణు ఉడుగుల డైరెక్టర్ చేసిన ఈ సినిమాపై మేకర్స్ ఉద్దేశ్యం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. 

Virata parvam dasara poster viral:

Rana Daggubati and Sai Pallavi  Virata Parvam special poster on Dussehra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs