Advertisement
Google Ads BL

బాలయ్యకి రోజా ఫోన్..


నందమూరి బాలకృష్ణ - రోజా కలిసి చాలా సినిమాల్లో నటించారు. భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం లాంటి సినిమాలు బ్లాక్ బ్యస్టర్ హిట్స్ కూడా.. ఇక పాలిటిక్స్ లో ఇద్దరూ చెరో పార్టీలో ఉన్నా.. ఒకరి మీద ఒకరు ఫైర్ అయినా.. సినిమాల విషయం వచ్చేసరికి స్నేహంగానే ఉంటారు. తాజాగా రోజా బాలయ్య కి ఫోన్ చెయ్యగా.. బాలకృష్ణ కూడా ఎంతో ఆప్యాయంగా రోజా తో మాట్లాడడం హైలెట్ అయ్యింది./అది కూడా జబర్దస్త్ షో లో జేడ్జ్ గా ఉన్నా రోజా అక్కడి నుండే బాలకృష్ణకి ఫోన్ చేసింది. రోజా ఫోన్ ని వెంటనే బాలయ్య రిసీవ్ చేసుకుని రోజా చెప్పండి.. ఎలా ఉన్నారు అన్నారు బాలయ్య.

Advertisement
CJ Advs

జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేసాక.. అనసూయ మా సమక్షంలో బాలయ్య గారికి ఒకసారి ఫోన్ చెయ్యండి అనగానే.. మంచి మూడ్ లో ఉంటే ఓకె లేదంటే.. అంటూ బాలయ్యని ఉద్దేశించి రోజా ఫోన్ చెయ్యగా.. వెంటనే బాలకృష్ణ ఫోన్ ఎత్తారు. హలో సర్‌.. బాగున్నారా.. అని రోజా అడగ్గా.. రోజాగారు నమస్కారం. బాగున్నానమ్మా.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని రోజా అడిగితే మన అఖండ షూట్‌లో ఉన్నాను. అనగా.. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం. భైరవద్వీపం పార్ట్ 2నా.. లేక బొబ్బిలిసింహం పార్ట్‌ 2నా.. అందరూ మన కాంబో కోసం ఎదురు చూస్తున్నారని అనగా.. తప్పకుండా అంటూ జబర్దస్త్ కి నేను వస్తాను.. ఆది బ్రో, సుధీర్, అభి అందరూ ఎలా ఉన్నారు.. మీరు నాకన్నా పెద్దవాళ్లు అందుకే గౌరవం ఇస్తున్నా అంటూ ఆటపట్టించేసరికి జబర్దస్త్ స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ప్రస్తుతం దానికి స్సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Roja calls Balakrishna:

Roja calls Balakrishna on Jabardasth stage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs