Advertisement
Google Ads BL

సమంత కి స్టార్ హీరోల రేంజ్ లో


ఒక ఫెస్టివల్ కి హీరోలకీ సంబందించిన రిలీజ్ డేట్స్ కానీ, అఫీషియల్ ప్రకటనలు కానీ, లేదంటే కొత్త సినిమాల లుక్స్ కానీ, అదీ కాదు అంటే టైటిల్స్ కానీ రిలీజ్ చేస్తారు. కానీ ఓ హీరోయిన్ కి సంబందించిన లుక్స్ కేవలం ఆమె బర్త్ డే కి మాత్రమే స్పెషల్ గా వదులుతారు. అయితే ఈరోజు దసరా సందర్భంగా రామ్ చరణ్ కొత్త సినిమాల ముచ్చట్లతో రాగా.. మిగతా యంగ్ హీరోలు దసరా శుభాకాంక్షలు అంటూ కొత్త పోస్టర్స్ తో, కొత్త టైటిల్స్, రిలీజ్ డేట్స్ తో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడా హీరోయిన్స్ హైలెట్ కాలేదు. కానీ ఒక్క సమంత కే రెండు సినిమాల ప్రకటనలు రావడం విశేషం. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత పెరఫార్మెన్స్ ఫిలిమ్స్ ఎంచుకున్న సమంత కి స్టార హీరోల ఛాన్స్ లు రాలేదో.. లేదంటే ఒద్దనుకుందో కానీ.. చైతు తో డివోర్స్ అయ్యాక వెంటనే సమంత నటనకు ప్రధాన్యమున్న సినిమాలు ఒప్పేసుకుంది.

Advertisement
CJ Advs

అందులో తెలుగు, తమిళ్ లో ఓ కొత్త దర్శకుడితో సినిమా అఫీషియల్ ప్రకటన తో వచ్చిన సమంత ఇప్పుడు రెండో సినిమాని ఈ దసరాకి ప్రకటించడం మరింతగా సర్ ప్రైజ్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌  తెలుగు, తమిళ  భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ఆదిత్య 369 తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను . నానితో జెంటిల్‌మన్‌, సుధీర్‌బాబుతో సమ్మోహనం నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యారు. వెంటనే ఓకే చెప్పారు. హరి, హరీష్‌ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లోతెలుగు, తమిళ  భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారాయన.

సో సమంత డబుల్ ధమాకా అంటూ ఈ దసరాకు తన సినిమాల ప్రకటనలతో స్టార్ హీరోల సరసన చేరిపోయింది. 

Samantha Ruth Prabhu signs bilingual film post her divorce announcement:

Samantha next confirmed in Sivalenka Krishna Prasad Sridevi Movies Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs