Advertisement
Google Ads BL

వరుడు కావలెను కొత్త రిలీజ్ డేట్


యంగ్ హీరో నాగ శౌర్య , రీతువర్మ’ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం వరుడు కావలెను. అసలైతే ఈ వరుడు కావలెను మూవీ ఈ రోజు దసరా సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు దసరా సందర్భంగా ఈ సినిమాని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా, అలాగే దిగు దిగు నాగ, మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది. 

ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో వరుడు కావలెను చిత్రం  మిమ్మల్ని అలరించటానికి మీముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29 న విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

Varudu Kaavalenu releasing on October 29th:

Naga Shaurya, Ritu Varma stared Varudu Kaavalenu releasing on October 29th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs