Advertisement
Google Ads BL

ఫాన్స్ కి వరాలిచ్చిన విజయ్ దేవరకొండ


విజయదశమి పండగ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా తీసుకొచ్చింది. గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు కోరిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు.

Advertisement
CJ Advs

ఒక అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు విజయ్, అలాగే మీతో లైగర్ మూవీ చూడాలని ఉందన్న మరో అభిమాని కోరిక తీర్చుతూ నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోని థియేటర్ లో లైగర్ మూవీ చూద్దామని చెప్పి ఖుషీ చేశారు. ఇంకొక అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు టికెట్ ఫ్రీ అని అతన్ని సర్ ప్రైజ్ చేశారు. మన రౌడీ గ్యాంగ్ అందరితో కలిసి లైగర్ మూవీ చూద్దామని మరికొందరు అభిమానులకు ప్రామిస్ చేసి వారిని సంతోషపెట్టారు. ప్రభాస్ ను కలిపించండి అని కోరిన ఇంకో అభిమానికి, ఓకే డన్ అంటూ చెప్పారు. 

ఇలా తన అభిమానులను ట్విట్టర్ ద్వారా పలకరించాలని చాలా రోజులుగా అనుకుంటున్న విజయ్..తన సినిమా షూటింగ్ బిజీలో చేయలేకపోయారు. కానీ పండగ టైమ్ లో ఫ్యాన్స్ తో కాసేపు ట్విట్టర్ ద్వారా ముచ్చటించి వారు తనపై చూపించే అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Vijay Devarakonda interacts with his fans:

Vijay Devarakonda chit chat with his fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs