సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజున బైక్ యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అప్పటి నుండి ఆయనకు అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మధ్యలో సాయి తేజ్ భుజానికి ఆపరేషన్, ఓకల్ కార్డు కి ఆపరేషన్ చెయ్యగా.. భుజానికి మళ్ళీ రెండోసరి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. సాయి తేజ్ మెల్లగా కోలుకుంటున్నాడని మధ్యలో డాక్టర్స్ అప్ డేట్ ఇస్తూ వచ్చారు. అయితే వినాయక చవితికి ఆసుపత్రి పాలైన సాయి తేజ్ దసరా పండగకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన విషయాన్ని చిరంజీవి.. సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. సాయి తేజ్ ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్ అంటూ చిరు ట్వీట్ వేశారు.
గత నెల రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్న సాయి తేజ్ ఎలా ఉన్నాడో అని మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. అయితే తాజాగా పండగ రోజు సాయి తేజ్ డిశ్ఛార్జ్ అవడంతో మెగా ఫాన్స్ ఆనందిస్తున్నారు. ఇక హాస్పిటల్ నుండి డిశ్ఛార్జ్ అయిన సాయి తేజ్ త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఓ రెండు నెలల పాటు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అయన తన తదుపరి సినిమాల షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి తేజ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.