Advertisement
Google Ads BL

పవన్ కల్యాణ్ - మంచు మనోజ్ ల భేటీ


పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో ఇండస్ట్రీ పెద్దలు జగన్ ప్రభుత్వంతో లాలూచి పడుతున్నారని అనగానే.. నెక్స్ట్ డే మంచు మోహన్ బాబు.. లైన్ లోకొచ్చి మా ఎన్నికలు జరగనివ్వండి పవన్ కళ్యాణ్ అన్నమాటకు సమాధానం చెబుతా అన్నాడు. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం ప్రకాష్ రాజ్ కే అని మంచు విష్ణు బహిరంగంగానే చెప్పాడు. చిరు ఫోన్ చేసి విష్ణు ని విత్ డ్రా కూడా చేసుకోమన్నారు అని విష్ణు ఓపెన్ అయ్యాడు. ఇక మోహన్ బాబు మా ఎన్నికల టైం లో పవన్ కళ్యాణ్ ని పక్కకి తీసుకెళ్లి మాట్లాడడం మీడియాలో హైలెట్ అయ్యింది. పవన్ కూడా మోహన్ బాబు గారు మా అన్నయ్య చిరు స్నేహితులు అని చెప్పాడు. ఇక పవన్ వకీల్ సాబ్ ని మోహన్ బాబు ఫోన్ చేసి మెచ్చుకున్నట్లుగా విష్ణు చెప్పాడు. ఇంతకీ వారి మధ్యన వైరమా - స్నేహమా అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ.. తాజాగా భీమ్లా నాయక్ సెట్ లో మంచు మనోజ్ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ని భేటీ అవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

భీమ్లా నాయక్  పవన్ కల్యాణ్ గారితో మంచు మనోజ్ గారు గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇందుకు భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ వేదికైంది. స్వతహాగా పవన్ కల్యాణ్ గారంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే మనోజ్ పట్ల పవన్ కల్యాణ్ గారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది.. అంటూ పవన్ కళ్యాణ్ పీఆర్ టీం ఫొటోస్ ని షేర్ చేసింది. మరి ఇండస్ట్రీ సమస్యల కోసమే మనోజ్ పవన్ ని భేటీ అయ్యాడా? ఇంకేం లేదా? అంటున్నారు నెటిజెన్స్ 

Manchu Manoj Meet Pawan Kalyan:

Pawan Kalyan - Manchu Manoj meeting 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs