Advertisement
Google Ads BL

కలుద్దాం ఆహాలో: బాలకృష్ణ


నందమూరి బాలకృష్ణ ఇప్పటికి విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య డైలాగ్స్ కి ఫాన్స్ కి పూనకాలే. బాక్స్ ఆఫీస్ రూలర్.. సినిమాల్లో అనర్గళంగా గుక్కతిప్పుకోకుండా డైలాగ్ డెలివరీతో అదరగొట్టేసే బాలయ్య బాబు.. బయట మాట్లాడాలంటే.. 66 తప్పులు ఉంటాయి. అసలు ఓ స్టేజ్ మీద బాలయ్య స్పీచ్ ఇస్తున్నాడంటే.. ఆయనేం మాట్లాడతాడో అనే క్యూరియాసిటీ కన్నా.. ఏం మాట్లాడుతున్నాడో అనే కన్ఫ్యూజన్ అందరి మొహాల్లో కనిపిస్తుంది. అలాంటి బాలకృష్ణ ఓ టాక్ షో కి హోస్ట్ గా అనేసరికి అందరిలో ఆసక్తి, ఆత్రుత మొదలైపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ తో భారీగా మొదలైన ఆహా ఓటిటి కోసం బాలయ్య టాక్ షో చెయ్యబోతున్నారు. అల్లు అరవింద్ బాలయ్య అడిగి మరీ ఈ షో కి ఒప్పించారు. ప్రస్తుతం బాలయ్య షో కి సంబందించిన ప్రెస్ మీట్, స్నేక్ పీక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఆ వీడియో లో బాలకృష్ణ ని బాక్స్ ఆఫీస్ రూలర్, ద లెజెండ్, ద ట్రెండ్ సెట్టర్, ద మాన్ ఆఫ్ మాస్సెస్ NBK  ఫస్ట్ టైం ఓ టాక్ షో లో.. ద బాప్ అఫ్ ఆల్ టాక్ షోస్ అంటూ గ్రాండ్ కాదు స్టైలిష్ గా బాలయ్యని పరిచయం చేసారు. మరి బాలకృష్ణ కూడా ఎగురుతున్న కళ్ళజోడు ని చాలా స్టయిల్ గా పట్టుకుని పెట్టుకుని.. అన్ స్టాపబుల్ అంటూ అదరగొట్టేసాడు. అంతేకాదు.. కలుద్దాం ఆహాలో అంటూ ఓ డైలాగ్ కూడా వదిలారు. ఈ టాక్ షో నవంబర్ 4 నుండి ప్రసారం కాబోతున్నట్టుగా ఆహా వీడియోస్ వారు ప్రకటించారు. మరి బాలయ్య షో లో హోస్ట్ గా ఎలా ఉంటారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తారు.. ఆయనకు రాబోయే గెస్ట్ లపై అప్పుడే ఫాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. 

Balakrishna Unstoppable Sneak Peak out:

Balakrishna Unstoppable Sneak Peek explodes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs