Advertisement
Google Ads BL

డిసెంబర్‌లో నాని శ్యామ్ సింఘరాయ్


నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘరాయ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాహుల్  సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ పార్ట్ అద్భుతంగా ఉండబోతోంది. అందుకే  పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టనుంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే విడుదలైన శ్యామ్ సింఘరాయ్‌గా నాని ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. సాయి పల్లవి, కృతి శెట్టిల పాత్రలను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఇక దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త  పోస్టర్ విడుదల చేసింది. ఇందులో వాసు పాత్రలోని నాని లుక్కును రివీల్ చేశారు. మిక్కీ జే మేయర్ తన సంగీతంతో రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్‌ను చూపించారు.

వెనకాల కాళీమాత విగ్రహం, ముందు నాని ఉన్న ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.  ఎంతో పవర్ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌ నాని అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది.  వాసు పాత్రలో నానీని ఎంతో ఇంటెన్సిటీని చూపించడంతో పోస్టర్‌పై అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో నాని బెంగాలీ కుర్రాడిగా శ్యామ్ సింఘరాయ్ పాత్రలో కనిపిస్తారు. అదే సమయంలో వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో మెప్పించనున్నారు.

అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోందని ప్రకటించారు. విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు భారీ స్థాయిలో టీం కష్టపడుతోంది.

Shyam Singha Roy To Release In Theatres This December:

Nani Shyam Singha Roy update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs