మా ఎన్నికల గొడవలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని లాగేసి జీవిత రాజశేఖర్ ఆ తర్వాత నాలుక కరుచుకుని సారి చెప్పింది. మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి ఎన్టీఆర్ రానన్నాడు అంటూ ప్రచారం జరగడమే కాదు.. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదు.. ఎవరికీ ఓటు కూడా వెయ్యలేదు. ప్రభాస్, తారక్, మహేష్ లాంటి స్టార్ హీరోస్ మా ఎన్నికలకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యాక.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ కొంతమందికి షూటింగ్స్ ఉండి మా ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. కొంతమందికి పర్సనల్ ఇష్యుస్ ఉన్నాయి.
ఇక తారక్ మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి ఎందుకు రాలేదో.. నాకు తెలుసు, మా అధ్యక్షుడిగా నేను గెలిచాను అని ప్రకటించాక.. మొదటి ఫోన్ కాల్ నాకు తారక్ నుండే వచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపాడు.. నా తమ్ముడు తారక్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది.. ఆయన ఓటు ఎందుకు వెయ్యలేదో నాకు తెలుసు మీకు చెప్పాల్సిన ఆవరసం లేదు అంటూ మంచు విష్ణు తారక్ ఈ మా ఎన్నికల్లో ఓటు వెయ్యకపోవడానికి కారణాలు, తనకి ఫోన్ చేసిన విషయాలను పంచుకున్నాడు.