మా ఎన్నికల రసాభసగా మారి.. చివరికి మా అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు చేజిక్కించుకున్నాడు. ప్రకాష్ రాజ్ పై పోటీ చేసి.. మా ఎన్నికలను వేడెక్కించి.. ఈ ఎన్నికలని పరువు ప్రతిష్టలు గా తీసుకుని మరీ ఎన్నికల్లో గెలిచాడు మంచు విష్ణు. మా ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి రెడీ అయ్యాకే.. ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు విష్ణు. అలాగే నందమూరి బాలకృష్ణ దగ్గరకి వెళ్లి హామీ తీసుకుని మద్దతు కోరాడు. ఇక మా ఎన్నికలు పూర్తయ్యి.. అధ్యక్షుడిగా ఎన్నికయిన మంచు విష్ణు నిన్ననే మా బాధ్యతలను స్వీకరించాడు. ఇక తర్వాత ఇండస్ట్రీ పెద్దలని కలిసి మరోసారి కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.
ఇప్పటికే కైకాల, కోటాలని కలిసిన మంచు విష్ణు నేడు తండ్రి మోహన్ బాబు తో కలిసి వెళ్లి.. నందమూరి బాలకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి థాంక్స్ చెప్పాడు. గతంలో బాలయ్య అల్లుడు ఓడిపోవడానికి పని చేశాను. కానీ బాలయ్య మా ఎన్నికల్లో మంచు విష్ణు ని సపోర్ట్ చేసాడు. విష్ణు వెనుక నిలబడ్డ బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపేందుకు విష్ణు తో పాటు బాలక్రిష్ణని కలిసినట్టుగా మోహన్ బాబు తెలిపారు. మా భవనం విషయంలో మంచు విష్ణు కి అండగా ఉంటాను అని బాల్కకృష్ణ మాటిచ్చారు అంటూ మోహన్ బాబు తెలిపారు.
ఇక మంచు విష్ణు ఈ నెల 16 న ఉదయం మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని, మా రాజీనామాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని విష్ణు తెలిపాడు.