Advertisement
Google Ads BL

క్లాస్ కిక్ ఇవ్వలేదు మరి.. మాస్


ఈ ఏడాది లాక్ డౌన్ అవ్వగానే.. థియేటర్స్ తెరుచుకోవడంతో మార్చ్ 11 న శివరాత్రి స్పెషల్ గా శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీని రిలీజ్ చేసారు. వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం సినిమాకి సూపర్ హిట్ అయ్యింది. టాక్ మాత్రం హిట్టే.. కానీ కలెక్షన్స్ నిల్. సాఫ్ట్ వెర్ ఉద్యోగి ఆధునిక పద్దతులతో వ్యవసాయం ఎలా చేసాడు అనేది శ్రీకారం కాన్సెప్ట్. ఉప రాష్ట్రపతి దగ్గరనుండి అందరూ సినిమాని మెచ్చుకున్నారు. కానీ సినిమాకు కలెక్షన్స్ రాలేదు. దానికి కారణం జాతి రత్నాలు కామెడీ బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీకారం హిట్ అన్నా.. బాక్సాఫీసు మెరుపులు లేకుండా పోయాయి. మరి క్లాస్ గా ఈ సినిమాలో కనిపించిన శర్వకి శ్రీకారం ఆనందాన్ని ఇవ్వలేకపోయింది.

Advertisement
CJ Advs

మరి రేపు దసరా స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న మహాసముద్రం శర్వానంద్ కి హిట్ కట్టబెడుతుందా. సిద్దార్థ్ - శర్వానంద్ హీరోలుగా RX100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం వరల్డ్ వైడ్ గా రేపే థియేటర్స్ లోకి రాబోతుంది.ఇంట్రెస్టింగ్ ట్రైలర్, ఆసక్తికర ప్రమోషన్స్, అద్భుతమైన లుక్స్, హీరోయిన్స్ గ్లామర్ అన్ని సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి శర్వాకి శ్రీకారం ఇవ్వలేని విజయం మాస్ మహాసముద్రం ఇస్తుందేమో చూడాలి. 

Class did not kick and, Mass?:

Sharwanand Maha Samudram release tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs