మా మాజీ అధ్యక్షుడు నరేష్ పై ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎప్పటికప్పుడు దారుణమైన ఆరోపణలు చేస్తూనే వచ్చారు. ఆఖరికి మా కి అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాక కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్ళు నరేష్ ని వదల్లేదు. కేవలం నరేష్ వలనే మా సభ్యత్వానికి, పదవులకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కె అర్హత ఉంది అంటూ నరేష్ మొదటి నుండి మంచు విష్ణు నే సపోర్ట్ చేసాడు. ఈ మా ఎన్నికల్లో నరేష్ చేసిన హడావిడి చూసినవాళ్లు.. ఏంటి ఈయన అంత అతి చేస్తున్నారు అనుకున్నారు. ఇక తాజాగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణం చేసారు.
ఆ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకు ఆరోపణలు చేస్తూ రాజీనామాలు చేసారు. మంచు విష్ణు ఈ రోజు మా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. మా తో ఎంతోమందిని ఆదుకున్నాం, అది ఓ సేవా సంస్థ. కొత్తగా ఏర్పాటు చేసిన మా పాలక వర్గాన్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. మంచు విష్ణు ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఊరుకునేది లేదు.. అంటూ ఓ వార్నింగ్ లాంటిది ఇచ్చేసారు. అసలు మా ఎన్నికల టైం లో అందరం కలిసి పని చేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకిలా రాజీనామాలు చేస్తున్నారు. మోడీ బిజెపి గెలిచింది అని, కాంగ్రెస్ రాజకీయాలు నుండి తప్పుకోలేదు. మా సభ్యులెవరూ రాజీనామాలు చేసే అవసరం లేదు అంటూ మాట్లాడారు నరేష్.